ఏపీలో ఆ పార్టీ గెలిచినా ఆశ్చర్యం లేదు: మురళీధర్‌రావు

Update: 2019-05-08 09:27 GMT

ఏపీ ఎన్నికల ఫలితలపై ఇప్పుడు గల్లీ నుండి ఢిల్లీదాకా ఇదే చర్చ. ఓ వైపు బెట్టింగు రాయుళ్లు జోరుగా ఏపీ ఫలితాలపైనే కన్ను. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఏపీ ఫలితాలు, తామ పార్టీ ఎన్ని సీట్లతో గెలువబోతుందో చెప్పారు. మంగళవారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో తెలుగు మీడియాతో మురళీధర్‌రావు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ పార్టీ 6 ఎంపీ స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తోందని అన్నారు. అందులో కరీంనగర్‌, నిజామాబాద్‌, మల్కాజిగిరి, మహబూబ్‌నగర్‌తో పాటు మరో రెండు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు ఖాయమన్నారు.

కాగా ఏపీ ఆపద్దర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్ప ఎన్నికల కార్యదక్షుడు అని ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. తమకు ఉన్న సమాచారం మేరకు ఏపీలో వైసీపీకి 110 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉండవచ్చన్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో గత నెల రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, మోదీ నాయకత్వంలో బీజేపీ 280 నుంచి 310 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉందని అన్నారు.  

Similar News