హత్య కేసులో మంత్రి కొడుకుకి జీవిత ఖైదు

Update: 2019-06-06 05:09 GMT

హత్యకేసులో దోషిగా తేలిన అరుణాచల్‌ ప్రదేశ్‌ పరిశ్రమల మంత్రి టుంకె టగ్రా కుమారుడు కజుమ్‌ బగ్రాకు జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది.వెస్ట్‌ సియాంగ్‌ జిల్లా ఆలో పట్టణంలోని హోటల్‌ వెస్ట్‌ వెలుపల కెంజుం కంసి అనే వ్యక్తిని 2017 మార్చి 26న బగ్రా తుపాకితో కాల్చి చంపినట్లు అభియోగాలు రుజువైనందున కజుమ్‌ బగ్రాకు జీవిత ఖైదు విధించినట్టు కోర్టు వెల్లడించింది. అయితే కాంట్రాక్టు చెల్లింపు విషయంలో చోటుచేసుకున్న వివాదమే ఇందుకు కారణంగా వెల్లడించారు. హోటల్‌ ఉన్న సీసీటీవీ కెమెరాలో సైతం హత్య దృశ్యాలు రికార్డు కావడంతో మంత్రి కుమారుడి బాగోతం బయటపడింది. ఈ హత్య జరిగిన సమయంలో మంత్రి టుంకె టగ్రా అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు. జీవిత ఖైదు కింద దోషిగా తేలిన వ్యక్తి కనీసం 14 ఏళ్లు జైలు జీవితం గడపాల్సి ఉంటుంది.

Tags:    

Similar News