బ్రేకింగ్: ఏపీలో బీజేపీకి భారీ షాక్.. ఎమ్మెల్యే రాజీనామా

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో కమలం పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బీజేపీకి సోమవారం రాజీనామా చేశారు. ప్రస్తుతం రాజమండ్రి అర్బన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.

Update: 2019-01-07 07:30 GMT
Akula Satyanarayana

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో కమలం పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బీజేపీకి సోమవారం రాజీనామా చేశారు. ప్రస్తుతం రాజమండ్రి అర్బన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం స్వయంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. గత ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి ఆకుల సత్యనారాయణ బీజేపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆకుల సత్యనారాయణ బీజేపీలో ఉండగానే ఆయన సతీమణి జనసేనలో పనిచేస్తున్నారు. గతకొద్ది రోజులుగా సత్యనారాయణ జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఆకుల దంపతుల్లో ఒకరికి ఎంపీ, మరొకరికి ఎమ్మెల్యే సీటు ఖాయమైనట్లు వార్తలు వినవస్తున్నాయి. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ నుంచి స్పష్టమైన హామీ రావడంతోనే ఆయన బీజేపీకి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. కాగా త్వరలోనే ఆయన పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకుంటారని సమాచారం.

Similar News