పవన్ తో సినిమా చేయడం లేదు : బండ్ల గణేష్

Update: 2019-05-29 04:24 GMT

తాజాగా గడిచిన ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరంగా  ఓడిపోయింది. అయితే, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మాత్రమే ఉంటానని  స్పష్టం చేసిన తర్వాత కూడా అయన సినిమాల్లోకి వస్తారనీ, ఫలానా   డైరెక్టర్ తో సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి .. ఈ నేపధ్యంలో పవన్ బండ్ల గణేష్ నిర్మాణ సారధ్యంలో బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుదని దాని కోసం పవన్ కు రూ. 40 కోట్లు ఆఫర్ చేశారని వార్తలు వచ్చాయి .. దీనిపై నేడు బండ్ల గణేశ్ స్పందించారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ట్వీట్ పెడుతూ, ఇది నిజం కాదని స్పష్టం చేశారు. తన బ్యానర్ లో ఏ సినిమా కూడా ఇంతవరకూ ఫైనలైజ్ కాలేదన్నారు. ఏదైనా సినిమా ఉంటే మొట్టమొదట అనౌన్స్ చేసేది తానేనని అన్నారు.



Similar News