నల్ల దుస్తుల్లో సీఎం చంద్రబాబు..!

Update: 2019-02-01 05:21 GMT

కేంద్రం తీరుకు నిరసనగా సీఎం చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు నల్ల దుస్తుల్లో అసెంబ్లీకి హాజరయ్యారు. ఏపీ హక్కుల సాధనకు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు సీఎం కార్యచరణ ప్రకటించారు. విభజన చట్టం అమలులో కేంద్రం మొండి చేయి చూపిస్తున్నందుకు నిరసనగా ఫిబ్రవరి 1న నిరసన దినంగా పాటించాలని సీఎం పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా అమలును నీరుగారుస్తున్న ప్రధాని మోదీ వ్యవహార సరళిని ఆయన ఖండించారు. ఏపీకి సహకారం అందివ్వడంలో కేంద్రం వివక్ష చూపడానికి నిరసనగా ఎమ్మెల్యేలను నల్లదుస్తులు ధరించాలని సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఎమ్మెల్యేలు నల్లదుస్తులు ధరించి అసెంబ్లీకి వచ్చారు.  

Similar News