రోడ్డు ప్రమాదంలో హీరోకు గాయాలు.. మహిళ మృతి

Update: 2019-04-27 10:32 GMT

టాలీవుడ్ యువ కథానాయకుడు శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ చిత్రంతో పరిచయమైన సుధాకర్ కోమకుల ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంగళగిరి (మం) చినకాకాని జాతీయ రహదారిపై శనివారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, సుధాకర్‌ గాయపడ్డాడు. జాతీయ రహదారిపై మొక్కలకు నీళ్లు పెడుతున్న మహిళను సుధాకర్‌ కారు అదుపుతప్పి బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఆ మహిళ అక్కడికక్కేడే మృతి చెందింది. సుధాకర్‌ తాజాగా నువ్వు తోపురా చిత్రంలో నటించారు. మే 3న విడుదల కానున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. 

Similar News