పాక్ కు పట్టుబడ్డ వింగ్ కమాండర్ అభినందన్ కు యావత్ భారతదేశం అండగా నిలుస్తోంది. జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్‌ను పాకిస్థాన్ తక్షణం విడిచిపెట్టాలని ఏక కంఠంతో నినదిస్తోంది. పైలెట్ అభినందన్ ధైర్యసాహసాలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. ప్రత్యర్థులకు చిక్కినా అభినందన్ ధైర్యం కోల్పోలేదన్నారు. దేశ రహస్యాలను వెల్లడించేందుకు నిరాకరించిన అభినందన్‌కు సెల్యూట్ చెప్పారు. ధైర్యసాహసాలు, హుందాతనాన్ని అభినందన్ ప్రదర్శించారంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
What a contrast!! While petty politicking & TRP wars in media plays out back home;
— KTR (@KTRTRS) February 28, 2019
A calm, composed, wounded Indian pilot #Abhinandhan refuses to divulge information. Salute this ultra dignified braveheart for his courage under fire 🙏🇮🇳🙏#AbhinandanMyHero #BringHimHome