నాటి నరమేధానికి సరిగ్గా వందేళ్లు: రూ.100 నాణెం విడుదల

Update: 2019-04-13 12:56 GMT

జలియన్ వాలాబాగ్ దుర్ఘటనకు నేటితో వందేళ్లు నిండాయి. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధులకు ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జలియన్‌ వాలాబాగ్‌ మారణహోమం జ్ఞాపకార్థం కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల నాణేన్ని విడుదల చేసింది. నాణేన్ని, జలియన్ వాలాబాగ్ స్మారక స్టాంప్ ను ఆవిష్కరించారు. వందలాదిమందిని చంపిన బిట్రీష్‌ దుశ్చర్యకు వంద సంవత్సరాల పూర్తయిన సందర్భంగా వెంకయ్యనాయుడు ఈ నాణేలను శనివారం విడుదల చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇది అందరి హృదయాన్ని కలచివేస్తున్న ఘటనగా వెంకయ్య పేర్కొన్నారు. వారి త్యాగాల పునాదులమీదనే మనం స్వేచ్ఛాజీవనం గడుపుతున్నామని సమరయోధులను కొనియాడారు.

కాగా ప్రపంచ చరిత్రలో అత్యంత దారుణ సంఘటనగా జలియన్ వాలాబాగ్ ఉదంతం నిలిచిపోయింది. పంజాబీలకు అత్యంత ముఖ్యమైన వైశాఖీ ఉత్సవం సందర్భంగా వేలాది మంది 1919 ఏప్రిల్ 13న జనలర్‌ డయ్యర్‌ ఆధ్వర్యంలో జరిగిన జలియన్ వాలాబాగ్‌‌ కాల్పుల్లో వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 

Similar News