డొనాల్డ్ ట్రంప్ కు భారీ ఊరట

Update: 2019-03-30 04:16 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ ఊరట లభించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా కుట్ర పన్నిందంటూ వచ్చిన ఆరోపణపై ఎలాంటి ఆధారాలు లేవని ప్రత్యేక దర్యాప్తు అధికారి రాబర్ట్ ముల్లర్ స్పష్టం చేశారు. ఈ మేరకు రాబర్ట్ ముల్లర్ తన నివేదికలో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ట్రంప్ చట్టాన్ని అతిక్రమించలేదని అందులో స్పష్టం చేశారు. కాగా దీనిపై దాదాపు 22 నెలలపాటు దర్యాప్తు సాగింది. అయితే ఇన్ని రోజుల్లో ఏ ఒక్క ఆధారం కూడా సంపాదించలేదు.

దీంతో ఎన్నికల్లో ట్రంప్ కు అనుకూలంగా రష్యా ప్రమేయం లేదని తేలింది. కొంతకాలంగా దీనిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్ ఈ నివేదికతో ఊరట లభించినట్లయింది. మరోవైపు అధ్యక్షుడు ట్రంప్ కు వ్యతిరేకంగా సాగిన ఈ దర్యాప్తులో ఎటువంటి ఆధారాలు లభించలేదని అటార్నీ జనరల్ విలియమ్ తెలిపారు. కాగా 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ రష్యాప్రభుత్వంతో కలిసి కుట్రపన్నారని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి హిల్లరీక్లింటన్ తోపాటుగా పలువురు ఆరోపించారు. 

Similar News