కాకులు దూరని కారడవిలో భారీ తిమింగలం మృతదేహం

Update: 2019-02-25 13:19 GMT

అమెజాన్ అడవుల్లో ఓ భారీ తిమింగలం మృతదేహం లభ్యమైంది. ఏడాది వయసు కూడా లేని ఈ భారీ సైజు తిమింగలం మృతదేహం ఫోటోలు సామాజికమాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.​ బ్రెజిల్‌లోని మరాజో ఐలాండ్‌లో తిమింగలం మృతదేహం లభ్యమైంది. ఈ తిమింగలం మృతిచెంది 15 రోజులు అయి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది దాదాపు 36 అడుగుల పొడవున్న ఈ తిమింగలాన్ని హంప్‌బ్యాక్ జాతికి చెందినదిగా గుర్తించారు. సముద్రం నుంచి తిమింగలం మృతదేహం ఉన్న ప్రాంతం 15 మీటర్ల దూరంలో ఉంది. సముద్రంలో చనిపోయిన తర్వాత భారీ అలలకు తిమింగలం ఇక్కడికి కొట్టుకొని వచ్చి ఉంటుందేమో అని బయాలజిస్టులు భావిస్తున్నారు. తిమింగలం మృతిపై బిచో డాగువా ఇన్‌స్టిట్యూట్ బయాలజిస్టులు దర్యాప్తు జరుపుతున్నారు. 

Similar News