2 వేల 21 కోట్ల ఖర్చుతో మోడీ విదేశీ పర్యటన ఏం చెప్పింది!

Update: 2018-12-31 05:04 GMT

55 నెలలు..92 విదేశీ పర్యటనలు..ఇదీ మోడీ ఫారిన్ టూర్ రికార్డ్. మోడీ విదేశీ పర్యటనల్లో సరికొ్త్త రికార్డు సృష్టించారు. ఆయన ఫారిన్ టూర్లకు అయిన ఖర్చెంతో తెలిస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. 2 వేల 21 కోట్లు. అక్షరాలా మోడీ విదేశీ పర్యటనకు అయిన ఖర్చు ఇది. 2014 నుంచి 2018 వరకు ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలకు 2021 కోట్లు ఖర్చయినట్లు ప్రభుత్వం తెలిపింది. మోడీ విదేశీ పర్యటనల ఖర్చు వివరాలను విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వీకే సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. మోడీ కోసం ఛార్టెర్డ్‌‌ ఫ్లైట్స్‌, విమానాల నిర్వహణ, సదుపాయాల ఏర్పాటుకోసం 2 వేల 21 కోట్లు ఖర్చైనట్లు మంత్రి వివరించారు. ఒక్కో పర్యటనకు దాదాపు 22 కోట్ల ఖర్చయిందని చెప్పారు.

ప్రధాని మోడీ 55 నెలల కాలంలో 92 విదేశీ పర్యటనలకు వెళ్లగా..2015-16 మధ్య కాలంలో అమెరికా, ఇంగ్లండ్, జర్మనీ, కెనడాలతో కలిపి మొత్తం 24 దేశాల్లో పర్యటించారు. మోడీ మరో పారిన్ ట్రిప్ వెళితే అంతకు ముందు ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ పేరిట ఉన్న రికార్డ్‌ను తిరగరాసినట్టవుతుంది. మన్మోహన్ ప్రధానిగా ఉన్న పదేళ్ల కాలంలో 93 విదేశీ పర్యటనలకు వెళ్లగా...మోడీ కేవలం నాలుగేళ్ల ఏడు నెలల కాలంలోనే ఆ రికార్డును అధిగమించారు. మోడీ విదేశీ పర్యటనలకు ఐదేళ్ళలోపే 2 వేల 21 లక్షల కోట్లు ఖర్చవగా.. మన్మోహన్‌ సింగ్ 2009 నుంచి 2014 వరకు వేయా..346 కోట్లు ఖర్చు పెట్టారు.

మోడీ మరో రెండు విదేశీ పర్యటనలు చేస్తే ఇంకో రికార్డు అవుతుంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోపు మోడీ 2 ఫారిన్ టూర్లు చేస్తే..ఇందిరా గాంధీ తర్వాత అత్యధిక విదేశీ పర్యటనలు చేసిన రెండో ప్రధానిగా సరికొత్త రికార్డు సృష్టిస్తారు. అవకాశముంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తన 15ఏళ్ల పదవీ కాలంలో 113 విదేశీ పర్యటనలు చేశారు.

Similar News