కోల్‌కతాలో విపక్షాల రణభేరి..

విపక్షాల రణభేరితో మహానగరి మార్మోగింది. బీజేపీ వ్యతిరేక నినాదాలతో కోల్‌కతా దద్దరిల్లింది.

Update: 2019-01-20 04:56 GMT

విపక్షాల రణభేరితో మహానగరి మార్మోగింది. బీజేపీ వ్యతిరేక నినాదాలతో కోల్‌కతా దద్దరిల్లింది. మోడీ హఠావో, దేశ్‌ బచావో అంటూ బ్రిగేడ్‌ పరేడ్ మైదానం, కవాతు చేసింది. నాలుగు దిక్కులను తలపించే, పార్టీలన్నీ ఒకే దిక్కుగా, ఒకే గొంతుగా, ఒకే వేదికపై గర్జించాయి.

లోక్‌సభ ఎన్నికల ముంగిట్లో, బీజేపీ వ్యతిరేక పక్షాల ఐక్యతా సభా, సమరనాదం చేసింది. మమతా బెనర్జీ పిలుపందుకుని, దేశ నలుమూలల నుంచి వచ్చిన నాయకులు, మోడీని గద్దెదింపడమే ఏకైక లక్ష్యమని ప్రకటించారు. కోల్‌కతా సభ అదిరిపోయింది. సరే. మరి ఈ ఫ్రంట్‌ కాని ఫ్రంట్‌ను, ఫ్రంటుండి నడిపించేదెవరు. ఎవరికి వారే ఉద్దండ నాయకులనుకునే, నాయకులకు నాయకత్వం వహించేదెవరు. కోల్‌కత సభా వేదికగా, మోడీకి పంపిన సమర సంకేతమేంటి?

ఇసుకేస్తే రాలనంత జనం. కోల్‌కతా వీధులను జనసంద్రం చేసిన నీరాజనం. రకరకాల పార్టీలు ఏకమైన సందర్భం. నాయకులందరిదీ ఒకే నినాదం అదే మోడీ హఠావో దేశ్ బచావో. అన్ని పార్టీలది గొంతుక ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి. ఇసుకేస్తే రాలనంతగా హోరెత్తిన బ్రిగేడ్‌ మైదానంలో, ఉద్దండ నాయకులందరూ, సమైక్య రాగం వినిపంచారు. లోక్‌సభ ఎన్నికలకు సమరశంఖం పూరించారు.

Similar News