ఆఫ్రికా తెగలు... ప్రపంచ మూల మానవులు

Update: 2019-01-01 05:31 GMT

ఆఫ్రికన్లైన జీమా జాతి ప్రజలు జరుపుకునే కొత్తేడాది సంబరాలు, డిఫరెంట్. వీరికి న్యూఇయర్ జనవరిలో స్టార్ట్ కాదు. వీరి ఆకండ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్, నవంబర్ మాసాల్లో కొత్తేడాది వస్తుంది. ఉత్సవాలను రెండు వారాల పాటు గ్రాండ్‌గా జరుపుకుంటారు జీమా జనం. కొత్త ఏడాది ఉత్సవాలకు కేటాయించిన రెండువారాలూ, పూర్తిగా సంబరాలకే. ఏ పనీ ముట్టుకోరు. జీవనోపాధి కూడా పక్కనపెట్టేస్తారు. వ్యవసాయ పనులకూ విరామమే. వివాహాలూ వాయిదా వేసుకుంటారు. ఎందుకంటే న్యూఇయర్ వేడుకల్లో అందరూ పాల్గొనాలన్నదే వారి ఉద్దేశం. సామూహిక సంబరమిది.

జీమా వేడుకలు చాలా ఢిపరెంట్‌గా ఉంటాయి. కొత్త ఏడాదికి స్వాగతం పలకడం కాదు. గడిచిపోయిన కాలంలో ఘనంగా జరిగిన రోజులను తలచుకునే ఉత్సవం అది. ఈ వేడుకల్లో మరో ప్రత్యేకత ఏంటంటే...ఆడవాళ్లు మగవాళ్ల దుస్తులు ధరించడం...మగవాళ్లు ఆడవాళ్లలా తయారవడం. అన్నింటికంటే గొప్ప విషయం ఏంటంటే వీరిది మాతృస్వామ్య వ్యవస్థ. అమ్మ మాటే వేదం. స్త్రీ మాటే శాసనం.

ఆఫ్రికా తెగల్లో, జీమాలది ప్రత్యేకమైన తెగ. జీమాల జనాభా కూడా చాలా తక్కువ. కేవలం ఓ మూడున్నరలక్షల మందే. వీరు మాట్లాడే జీమా భాష కారణంగా వీరికి అప్పోలులు అనే పేరు వచ్చింది. సేద్యం వీరి ప్రధాన వృత్తి. వీరు జరుపుకునే నూతన ఏడాది వేడుకలను అబిస్స ఉత్సవంగా పిలుచుకుంటారు. 

Similar News