బూజు లడ్డూలు... నారసింహా ఇవేమీ ప్రసాదాలు

Update: 2018-10-08 10:19 GMT

యాదాద్రికి వచ్చే భక్తులు లడ్డూ ప్రసాదాన్ని మహాప్రసాదంగా భావిస్తారు. వ్యయప్రయాసాలకు ఓర్చి క్యూలైన్లలో నిల్చోని లడ్డూలు తీసుకుంటారు.  అయితే భక్తులకు ఎంతో ఇష్టమైన యాదాద్రి లడ్డూ ప్రసాదం నాణ్యత డొల్లగా మారుతోంది. లడ్డూ ప్రసాదం తయారీపై నిఘా కొరవడింది. శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో లడ్డూలు పెద్దమొత్తంలో తయారు చేశారు. తయారీదారులు లడ్డూలలో నెయ్యి తక్కువగా ఉపయోగించి నీటిని ఎక్కువగా వాడారు. 
లడ్డూల తయారీకి నెయ్యి తక్కువగా వాడటంతో 3వేల లడ్డూలు బూజుపట్టాయి.  అధికారులు గుట్టు చప్పుడు కాకుండా బూజు పట్టిన లడ్డూలను పడేశారు. దీంతో 60వేల రూపాయల నష్టం వాటిల్లింది. అభిషేకం లడ్డూల విక్రయాలు చేసే రూమ్ లో సరైన గాలి వెలుతురు సౌకర్యాలు లేకపోవడంతో లడ్డూలు పాడైపోతున్నాయి. లడ్డూల తయారీ కేంద్రంపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Similar News