చరిత్రలో ఈరోజు, నేటి సంచలనాలు (21/11/2017)

Update: 2017-12-12 11:34 GMT

గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర,  ఒక శాస్త్రముగా నిర్వచించినప్పుడు ప్రాధమికముగా రాతల ద్వారా భద్రపరచబడిన, జరిగిన కాలములోని మనుషుల, కుటుంబాల మరియు సమాజాల యొక్క పరిశీలన మరియు అధ్యయనమే చరిత్ర అని చెప్పవచ్చు. కాగా ఈ చరిత్రలో ఎందరో ప్రముఖులు మరియు వారి జనన మరణాలు, చారిత్రాత్మక వస్తువుల పరిచయం వంటి  విషయాలు,వెలుగులోకి తీసుకు రావడమే దీని ఉద్దేశ్యం.. ఇందులో భాగంగా సరిగా ఇవాళ్టి రోజు జరిగిన విషయాలు కొన్ని తెలుసుకుందాం..

ప్రపంచ మత్స్య దినోత్సవం
1. 1694 : ఫ్రాన్సు దేశానికి చెందిన తాత్వికుడు వోల్టయిర్ జననం (మ.1778).

2. 1854 : కాథలిక్ చర్చి యొక్క అధిపతి పోప్ బెనెడిక్ట్ XV జననం (మ.1922).

3. 1947: స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ళ విడుదలయింది. దీని విలువ మూడున్నర అణా లు.

4. 1783: మొట్టమొదటి వేడి గాలి బెలూన్ ను ఫ్రాన్సు లో ఎగురవేశారు.

5.1970: ప్రఖ్యాత శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత, చంద్రశేఖర్ వెంకటరామన్ మరణం (జ.1888).

6. 1996 : పాకిస్థాన్ భౌతిక శాస్త్రవేత్త , నోబెల్ బహుమతి గ్రహీత అబ్దుస్ సలామ్ మరణం (జ.1926).

 

Similar News