ఈజిప్టు లో నరమేధం సృష్టించిన ఉగ్రవాదులు 200 మందికి పైగా మృతి

Update: 2017-12-13 13:59 GMT

ఈజిప్టులో ఉగ్రవాద సంస్థలు రెచ్చిపోయాయి. బాంబు పేలుళ్లతో అమాయకుల ప్రాణాలను బలితీసుకున్నాయి. శుక్రవారం ఉత్తర సినాయి ప్రావిన్స్‌లోని ఓ మసీదులో జరిగిన ఘటనలో సుమారు రెండు వందల మంది ప్రాణాలు కోల్పోయారు. అల్‌-ఆరిష్‌ పట్టణంలోని అల్‌-రౌదా మసీదులో శుక్రవారం ప్రార్ధనల అనంతరం ప్రజలు తిరిగి వస్తుండగా బాంబు పేలింది. దీంతో జనం బయటకు వచ్చేందుకు ప్రయత్నిండంతో తొక్కిసలాట జరిగింది.

అంతేకాదు గేట్‌ వద్ద ఓగుర్తు తెలియని వ్యక్తి ప్రార్ధలకు వచ్చిన వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో సుమారు మంది ప్రాణాలు కోల్పోగా వందల సంఖ్యలో గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను వెంటనే పోలీసులు ఆస్పత్రులకు తరలించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు ఉన్నత స్థాయి అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ ఘటనకు ఇప్పటి వరకూ ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యులుగా  ప్రకటించుకోలేదు.

Similar News