రియల్ శ్రీమంతుడు

Update: 2018-06-14 06:58 GMT

ఆయనో ఎమ్మెల్సీ. అందరి రాజకీయ నాయకుల్లో ఒకడిగా కాకుండా, అందరిలో భిన్నంగా దూసుకెళ్తున్నారు. తనకు జన్మనిచ్చిన గ్రామాన్ని, తనను రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దిన గ్రామాన్ని సస్యశ్యామలం చేస్తున్నారు. ఇతర గ్రామాలకు ఆదర్శంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్సీ..? 

టీడీపీ ఎమ్మెల్సీ... తొండపు దశరథ జనార్థన్‌... కృష్ణాజిల్లా వత్సవాయి మండలం లింగాల గ్రామంలో జన్మించారు. అందరు నాయకుల్లా కాకుండా... కొందరు నాయకుల్లా... తాను పుట్టిన ఊరికి, తనను రాజకీయంగా నిలబెట్టిన గంగెల్లి, పోచవరం గ్రామానికి ఏదో ఒకటి చేయాలనుకున్నారు. ఆలోచన వచ్చిందే ఆలస్యం... గ్రామాలను దత్తత తీసుకొని జిల్లాలోనే ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దారు ఎమ్మెల్సీ జనార్థన్‌.

గతంలో అడుగడుగునా సమస్యలతో సతమతమయ్యే ఈ గ్రామాల్లో ఇప్పుడు అన్నీ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి వీధికి సిమెంట్ రోడ్లు, వీధి దీపాలతో పాటు... స్మశానానికి పోయే రహదారి సైతం సిమెంటు రోడ్లు వేసి ఇక్కడి ప్రజల మన్ననలు పొందారు టీడీ జనార్థన్‌. ఈ గ్రామాల్లో ఏ సమస్య లేకుండా పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన అందరికీ ఇల్లు, రేషన్ కార్డులు, వృద్ధాప్య పింఛన్లు అందజేసి ఇక్కడ ప్రజల హృదయాలలో రియల్ హీరో గా నిలిచారు టీడీ జనార్థన్‌. భారీ ఎత్తున నిధులు సేకరించి తన దత్తత గ్రామాలను అదర్శగ్రామలుగా తీర్చిదిద్దారు.

టీడీపీలోనే ముఖ్యనేతగా రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నారు టీడీ జనార్థర్‌. తాను పుట్టిన ఊరికి రుణం తీర్చుకోవాలన్న తపనతో అలుపెరగకుండా శ్రమిస్తున్న జనార్ధనుడికి గ్రామస్థులు జేజేలు పలుకుతున్నారు. జన్మనిచ్చిన గ్రామాలను అభివృద్ధి చేయడంలో ముందుండాలని ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపుని స్ఫూర్తిగా తీసుకున్నారు. జన్మనిచ్చిన ప్రదేశాన్ని అభివృద్ధి చేయాలనే ఆశయంతో లింగాల గ్రామాన్ని, రాజకీయంగా అండగా ఉన్న గంగెల్లి, పోచవరం గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధికి కృషి చేస్తున్నారు.

Similar News