హైందవధర్మం కాలపరీక్షను తట్టుకుని నిలబడుతుందా?

Update: 2018-10-16 07:27 GMT

కేరళ అయ్యప్ప ఆలయంలోకి మహిళలకూ ప్రవేశం కల్పిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పెద్ద సంఖ్యలో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు... తీర్పుపై ప్రజా వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని రివ్యూ పిటిషన్ వేయాల్సిందిగా కేరళ సర్కార్ పై ఒత్తిడి పెరుగుతోంది.కానీ పినరయ్ విజయన్ ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నిన్న తీర్పును వ్యతిరేకిస్తూ మహిళలు పెద్ద సంఖ్యలో వీధుల్లో ఊరేగింపుగా వచ్చారు.. శతాబ్దాల నాటి ఆచారాలను, సంప్రదాయాలను హక్కుల పేరుతో కాలరాయద్దంటూ వారంతా తిరగబడ్డారు.

ధార్మిక అంశాలలో రాజకీయ లబ్ది చూసేంత నీచత్వం తమ పార్టీకి లేదని సనాతన సంప్రదాయం పరిరక్షించడమే తమ లక్ష్యమని బిజెపి అంటోంది.శబరిమల ఆలయంపై భక్తులకున్న నమ్మకాలను కాపాడటమే తమ కర్తవ్యమంటోంది రాష్ట్ర బిజెపి.. శబరిమల ప్రపంచవ్యాప్తంగా  కోట్లాది మంది భక్తులు సందర్శించే అతిపెద్ద ఆలయం. గతేడాది ఆలయానికి మకర విళక్కు సందర్భంగా అయిదుకోట్ల మంది భక్తులు పోటెత్తారు. కమ్యూనిస్టు పార్టీ గత 50 సంవత్సరాలుగా ఈ ఆలయంపై కన్నేసిందని, దీనిని ధ్వంసం చేయాలని చూస్తోందని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు.చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకుని ఆలయంపై పెత్తనానికి ప్రభుత్వం చూస్తోందని వారంటున్నారు.. సమస్యను 24 గంటలలో పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉథృతం చేస్తామని అల్టిమేటం ఇచ్చింది బిజెపి.. తమ ఆందోళనలన్నీ శాంతియుతంగానే ఉంటాయని ఎవరూ తమని ఆపలేమనీ వారంటున్నారు.

ఉద్యమాలను కాసేపు పక్కన పెడితే.. మన ఆలయాలు పురాతన సంస్కతికి  ప్రతిబింబాలు.. ఒక్కో ఆలయానికి ఒక చరిత్ర, ఆచార వ్యవహారాలూ ఉన్నాయి. శబరి మలలోనే కాదు దేశ వ్యాప్తంగా చాలా ఆలయాల్లో కొన్నింటిలోకి స్త్రీలు, కొన్నింటిలోకి పురుషులూ వెళ్లడం నిషిద్ధం..ఆడవారికే కాదు.. మగవారికి ప్రవేశం లేని ఆలయాలు కూడా ఉన్నాయి. సున్నితమైన ఈ అంశమే ఇప్పుడు వివాదానికి దారి తీసింది. టగ్ ఆఫ్ వార్ గా సాగుతున్న ఈ వివాదానికి కాలమే ముగింపు చెప్పాలి.. నిస్సందేహంగా హిందూ సంస్కృతికి ఎదురైన అగ్ని పరీక్ష ఇది.. హైందవ ధర్మం కాల పరీక్షకు తట్టుకుని నిలబడాల్సిన సమయం వచ్చింది.

Similar News