పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ పెళ్లిపై కొన్నాళ్ల నుండి చిలవలు పలవలుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆమె పెళ్లి వార్త టాలీవుడ్లోనే కాక పక్క రాష్ట్రాలలోను హాట్ టాపిక్‌గా మారింది. తోడు కోసం వెతుకుతున్నానని రేణూ ఎప్పుడో చెప్పిన, ఇటీవల తన పెళ్లిపై ఓ క్లారిటీ ఇచ్చింది. కాబోయే భర్తకి రింగు తొడుగుతూ ఉన్న ఫోటోని షేర్ చేసి త్వరలో పెళ్లి పీటలెక్కనున్న విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించింది రేణూ. ఈ సందర్భంగా పవన్ కూడా రేణూకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పెళ్లికి సంబంధించిన విశేషాలను రేణు ఓ ఆంగ్ల పత్రికతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఈ పెళ్లి ఆమె కుమారుడు అకీరా నందన్‌కి ఇష్టం లేదని.. దీంతో అతను అప్సెట్ అయ్యాడంటూ వస్తున్న వార్తలపై సరదాగా స్పందించింది. ‘‘చాలా మంది నా రెండో పెళ్లి కారణంగా అకీరా అప్సెట్ అయ్యాడని ఆరోపిస్తున్నారు. అకీరా అప్సెట్ అయిన మాట వాస్తవమే కానీ నిజానికి అతను అప్సెట్ అయింది పెళ్లి గురించి కాదు.. మెనూలో పనీర్ బటర్ మసాలా లేదని’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.