వెంకటేష్ కు బావగా రాజశేఖర్

Update: 2017-12-12 12:53 GMT

గరుడవేగాతో మాంచి జోష్ మీదున్న హీరో రాజశేఖర్ తన తదుపరి ప్రాజెక్ట్ తో అందరికి షాకిచ్చారు. గతంలో విలన్, హీరో, అన్నయ్య క్యారక్టర్లు చేసిన ఈ యాంగ్రీ యంగ్ మెన్ ఇప్పుడు బావ పాత్రలో అలరించనున్నాడు. చాలా కాలం తరువాత నేనే రాజు నేనే మంత్రితో హిట్ కొట్టిన డైరక్టర్ తేజ అదే ఊపు కంటిన్యూ చేస్తూ హీరో వెంకటేష్ తో  'ఆటా నాదే వేటా నాదే' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో బావ పాత్ర కీలకం కావడంతో  రాజశేఖర్ ను సంప్రదించడం ...ఆ కథ బాగా నచ్చడంతో ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. వచ్చేనెల 13వ తేదీన వెంకటేశ్ పుట్టినరోజున ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. ఇంతవరకూ చేయని పాత్రలో వెంకటేశ్ కనిపించనున్నారని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ .. మహేశ్ బాబు .. రామ్ తో మల్టీ స్టారర్ మూవీస్ చేసిన వెంకటేశ్, రాజశేఖర్ తో కలిసి ఈ సినిమా చేస్తుండటం విశేషం. ఇక తేజతో 'నేనే రాజు నేనే మంత్రి' రాజశేఖర్ చేయాల్సింది .. కానీ కుదరలేదు. పెద్ద గ్యాప్ లేకుండానే ఈ కాంబినేషన్ మళ్లీ సెట్ కావడం మరో విశేషం. 

Similar News