కేవలం ఒకే ఒక కన్నుగీటుతో దేశమంతా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న కేరళ భామ ప్రియా వారియర్ హైదరాబాద్కు వచ్చేస్తోంది. ఈ నెల 26న నగరంలో జరిగే 16వ సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు ఆమె హాజరు కానుంది. ‘బెస్ట్ ఫేస్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ఆమె అందుకునేందుకు ప్రియా హైదరాబాద్కి వస్తున్నట్టు సంతోషం సినీ మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి తెలిపారు. ఈ విషయమై ప్రియా వారియర్ అధికారికంగా మాట్లాడిన వీడియోను విడుదల చేశారు. పలువురు సెలబ్రిటీల సమక్షంలో అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్టు సమాచారం.