ఏపీలో పొలిటికల్‌ హీట్‌.. జంపింగ్ జపాంగ్‌లు స్టార్ట్

Update: 2018-09-15 10:25 GMT

ముందుస్తు ఎన్నికలతో తెలంగాణ రాజకీయాలు వేడి పుట్టిస్తుండగా.. ఏపీలో రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్దమవుతున్నాయి..ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న నేతలు అధిష్టాన దగ్గర లాబీయింగ్‌లు మొదలు పెట్టారు. పార్టీ కేడర్.. నేతలు చేజారిపోకుండా ఉండేందుకు కసరత్తులు ముమ్మరం చేస్తున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు.

ఏపీలో ఎన్నికల హడావుడి మొదలయ్యింది. సంక్షేమ.,అభివృద్ధి కార్యక్రమాలతో అధికార పక్షం సభలు.. సమావేశాలు నిర్వహిస్తుండగా.. ప్రజాసంకల్ప యాత్రతో ప్రతిపక్ష నేత జగన్ యాత్ర చేస్తున్నారు.. మరొ పక్క జనసేన ఓ అడుగు ముందుకు వేసింది. ఇతర పార్టీలకు చెందిన నేతలను తమవైపు మళ్లించుకోవడంలో నిమగ్నమయ్యింది. ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాలకు చెందిన పలువురు నేతలు జనసేనలోకి క్యూ కట్టారు. తూర్పు గోదావరి జిల్లా వైసీపీలో కొనసాగితే టిక్కెటు రాదని ముందే గ్రహించిన నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన కండువ కప్పుకుంటున్నారు. రాజమండ్రి నియోజకవర్గ ఇంచార్జ్ కందుల దుర్గేష్ ఇటీవల పవన్ చెంతకు చేరారు. ముమ్మిడివరం నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ బాలకృష్ణ జనసేనలో చేరినరోజునే ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించారు పవన్ కల్యాణ్. 

కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ జనసేన గూటికి చేరారు. కాకినాడ రూరల్ టికెట్ ఆశించిన సంగిశెట్టి అశోక్.. పెద్దపురం నియోజకవర్గానికి చెందిన అత్తిలి సీతారామస్వామి, రాజానగరం నియోజకవర్గానికి చెందిన రాయపురెడ్డి చిన్న జనసేనలో చేరారు. వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు.. జగన్ ఆలోచన విధానాలతోనే తాము పార్టీ వీడుతున్నామని జనసేనలో చేరుతున్న నేతలు చెబుతున్నారు. పి.గన్నవరంకు చెందిన మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి జనసేనలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ తో భేటీ అయిన రాజేశ్వరీ దేవి తమ అనుచరులతో కలిసి జనసేన కండువ కప్పుకోనున్నారు. జనసేనలోకి నేతల వలసలు వచ్చే ఎన్ని ఎంత వరకు ప్రభావం చూపుతాయన్నది రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. 
 

Similar News