తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలో ప్రధాని మోడీ, అమిత్ షా...

Update: 2018-11-22 13:45 GMT

తెలంగాణలో బీజేపీ ఎన్నికల ప్రచారం జోరు పెంచింది. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అద్యక్షుడు అమిత్ షా ప్రచార బరిలో దిగనున్నారు. సభలు, సమావేశాలు, రోడ్ షోలతో ప్రచారాన్ని కమలనాథులు మరింత వేడేక్కించనున్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ముమ్మరం చేస్తోంది. ఆ పార్టీ తరపున  ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రచారం చేయనున్నారు. ఈ నెల 27న ఉదయం నిజామాబాద్‌లో సభ, మధ్యాహ్నం వరంగల్‌లో బహిరంగ సభల్లో మోడీ ప్రసగించనున్నారు. డిసెంబర్ 3న హైదరాబాద్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో  మోదీ పాల్గొంటారు. 

మరో బీజేపీ అగ్రనేత అమిత్‌ షాఈ నెల 25న మధ్యాహ్నం 12 గంటలకు పరకాలలో బీజేపీ నిర్వహించే సభలో పాల్గొంటారు. ఆ తర్వాత నిర్మల్, దుబ్బాక,మేడ్చల్‌ సభలకు హాజరవుతారు. 28 తేది మధ్యాహ్నం 12 గంటలకు ఆదిలాబాద్‌లో సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత చౌటుప్పల్‌లో సభ,  హిమాయత్‌నగర్ లిబర్టీలో రోడ్ షో, ఎల్బీనగర్‌లో బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. 

ఈ నెల 28న ఎన్నికల ప్రచారం తర్వాత తిరిగి  డిసెంబర్ 2కు తెలంగాణకు అమిత్ షా వస్తారు. ఆ రోజు నారాయణపేట, ఆమనగల్‌లో సభలో పాల్గొంటారు. అనంతరం ఉప్పల్‌, మల్కాజిగిరిలో  రోడ్ షో నిర్వహించి , సాయంత్రం  కామారెడ్డిలో జరిగే సభలో అమిత్ షా పాల్గొంటారు. అగ్ర నేతలు  ప్రచారానికి వస్తుండడంతో కమలనాథులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 
 

Similar News