కత్తి మహేష్ కు కాటమరాయుడి రివర్స్ పంచ్ ..!

Update: 2017-12-13 05:36 GMT

తనపై నిత్యం ఏదో ఒక విమర్శ చేసే ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేష్ కు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరోక్షంగా సెటైర్ వేసాడు.. తనపై ఎవరు, ఎలాంటి విమర్శలు చేసినా పట్టించుకోనని, ఎవరెవరో వేసే పంచ్ లకు నేను సమాధానం చెప్పను.. అంటూ పరోక్షంగా కత్తి మహేష్ కు రివర్స్ పంచ్ వేసాడు పవన్.. అంతేకాదు అప్పట్లో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దివంగత పరిటాల రవి తనకు గుండు కొట్టించారని టీడీపీ నేతలే ప్రచారం చేసారు, కానీ అది శుద్ధ తప్పు "నా గుండు నేనే గీయించుకున్నా.." ఇంకెవరు గీయించలేదని స్పష్టం చేసారు..

ఇకనుంచి తన పార్టీపై విమర్శలు చేసే వాళ్ళను జనసేన పట్టించుకోదు, ఆలా కాదని జనసేన తరుపున పక్క పార్టీలపై విరుచుకు పడితే చర్యలు తప్పవని తెలియజేసారు.. ఇదిలావుంటే గత మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వారసత్వ రాజకీయం విషయంలో ఆయన్ను విమర్శిస్తున్న సంగతి తెలిసిందే..  దేనికి కౌంటర్ గా వైసీపీ కూడా సినిమాల్లో " మీ  అన్న ద్వారా మీకు వచ్చిన వారసత్వాన్ని మీరు ప్రశ్నించుకోండి", అంటూ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు..    

Similar News