యన్‌టిఆర్ బయోపిక్‌లో నందమూరి బాలకృష్ణ నటిస్తూన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా ఘాటింగ్ పూర్తిచేసుకొని వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 9న ప్రేక్షకుల ముందు కనువిందు చేయనుంది. కాగా ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రబృందం స్టిల్స్‌తో పాటు రెండు పాటలను కూడా విడుదల చేశారు. తాజాగా చిత్ర టైలర్, ఆడియో రిలీజ్ డేట్‌ను ప్రకటించేశారు. యన్.టి.ఆర్ ట్రైలర్ లాంచ్ డిసెంబర్ 16న హైదరాబాద్‌లో, అలాగే ఆడియో రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 21న నందమూరి తారకరామారావు పుట్టిన ఊరు నిమ్మకూరులో జరగనున్నాయని చిత్ర బృందం తెలిపారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించగా విద్యాబాలన్, నందమూరి కళ్యాణ్ రామ్, రానా దగ్గుపాటి, సుమంత్, రకుల్ ప్రీత్ సింగ్, లెజెండరీ కైకాల సత్యనారాయణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.