మలుపు తిరుగుతున్న విజయ్ ఆత్మహత్య కేసు..

Update: 2017-12-13 05:42 GMT

సినీ నటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసులో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయ్ ఆత్మహత్యతో నవయుగ సంస్థకు లింకులున్నాయా ? విజయ్ భార్య వనితారెడ్డి వాడుతున్న కారు నవయుగ పేరుతో ఎందుకుంది ? వనిత అసలు పేరు వరలక్ష్మి అయితే....వనిత అని పాస్‌పోర్ట్‌లో ఎందుకుంది. స్కూల్‌ సర్టిఫికెట్‌లో తండ్రి పేరు, పాస్‌పోర్ట్‌లో తండ్రి పేరు వేర్వేరుగా ఎందుకున్నాయ్ ? అసలు వనితారెడ్డి మొదటి భర్త అమ్మిరెడ్డి ఎక్కడున్నాడు. వనిత తల్లితో సహజీవనం చేసి...వనితను లోబర్చుకున్న రఫీకి నవయుగ సంస్థతో లింకేంటన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. అలాగే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ అనే న్యాయవాదికి, వనితకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారని తెలుస్తోంది. వీరికి నోటీసులిచ్చిననంతరం అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.

Similar News