హరికృష్ణ అంత్యక్రియలు పూర్తి...చితికి నిప్పంటించిన కళ్యాణ్ రామ్

Update: 2018-08-30 10:56 GMT

అశేష జనవాహిని మధ్య నందమూరి హరికృష్ణ అంతిమ మజిలీ ముగిసింది మెహదీపట్నం మసాబ్ ట్యాంక్‌లోని ఆయన నివాసం నుంచి మహా ప్రస్థానం వరకూ అంతిమయాత్ర సాగింది  హరికృష్ణ అమర్ రహే... జోహార్ హరికృష్ణ అనే నినాదాలు మిన్నంటాయి. అభిమానులు, శ్రేయోభిలాషులు, కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు పార్టీ శ్రేణుల అశ్రునయనాల మధ్య.. చైతన్య రథసారిథి నందమూరి హరికృష్ణ ఆఖరి మజిలీ ముగిసింది.. 

మెహిదీపట్నం లోని ఆయన నివాసం నుంచి  జూబ్లిహిల్స్ మహాప్రస్థానం వరకూ యాత్ర సాగింది. హరికృష్ణ భౌతికకాయంపై గౌరవంగా తెలుగుదేశం పార్టీ జెండాను కప్పారు... నందమూరి ఫ్యామిలీ సభ్యులతో కలిసి హరికృష్ణ భౌతికకాయం ఉన్న పాడేను ఏపీ సీఎం చంద్రబాబు,జస్టిస్ చలమేశ్వర్  యాత్ర కోసం సిద్ధం చేసిన వాహనం వరకూ మోసారు. 

మధ్యాహ్నం 2గంటల10 నిమిషాలకు ప్రారంభమైన హరికృష్ణ అంతిమయాత్ర.. జూబ్లిహిల్స్ మహా ప్రస్థానానికి 3గంటల 45 నిమిషాలకు చేరుకుంది.. జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి హరికృష్ణ పార్థివ దేహం చేరుకున్న అనంతరం.. శాస్త్రోక్తమైన క్రతువు పూర్తి చేశారు.. అంత్యక్రియల సందర్భంగా మెదట హరికృష్ణ భౌతికకాయానికి పోలీసులు గౌరవవందనం సమర్పించారు. అనంతరం పోలీసులు గాలిలోకి మూడురౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం తండ్రికి కళ్యాణ్ రామ్ అశ్రు నయనాలతో తలకొరివి పెట్టారు. 

Similar News