ఇక్కడ మనుషుల్ని అమ్మబడును

Update: 2017-12-12 11:27 GMT

స్థలములు కొనబడును మరియు అమ్మబడును, ఐడియాలు అమ్మబడును అనే మాటలు వింటుంటాం. అయితే  అక్కడ మాత్రం మనుషుల్ని అమ్మబడును అనే మాట ఎక్కువ వినబడుతుంది.  సంతలో పుశువుల్ని కొనుగోలు చేసినట్లు మనిషి కండ పుష్టిగా ఉంటే ఓ రేటు. సన్నగా ఉంటే ఓ రేటు. లావుగా ఉంటే మరో రేటు. ఇలా మనుషుల్ని భాగాలుగా విభజించి అమ్మకాలు జరుపుతున్నారు. 21వ శతాబ్దంలో కూడా ఇలాంటి రాతియుగపు ఆనవాళ్లు ఉన్నాయంటే నమ్మలేకపోతున్నాం. 
                                                 నియంతృత్వ పోకడల రాజ్యాన్ని కూల్చేయవచ్చు. అదే స్థిరమైన ప్రజాస్వామిక పాలన అందించడంలో పూర్తిగా విఫలమైతేం ఏం చేయలేం. 2011 టునేషియాలో ప్రారంభమైన జాస్మిన్‌ విప్లవంతో అరబ్ తన అపారమైన చమురు సంపదతో నియంతృత్వ పోకడలన్ని కొనసాగిస్తుంటే ... అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌, రష్యా-చైనాలు ఆ దేశంతో జత కట్టేందుకు వెంపర్లాడుతున్నాయి. దీంతో స్థిరమైన ప్రజాస్వామిక పాలన అందించడంలో విఫలమైన దేశాల ప్రజలు వలసబాట పట్టారు.  సిరియా, ఇరాక్‌లు ఐఎ్‌సఐఎస్‌ సున్నీ తిరుగుబాటు దారుల అంతర్యుద్ధ జ్వాలల్లో మండుతున్నాయి. లిబియాలో రాజ్యవ్యవస్థ కుప్పకూలింది. ఆఫ్రికా దేశాలు కూడా అల్లకల్లోలంగా మారాయి. దాంతో భద్రమైన జర్మనీ, హంగరీ, స్వీడన్‌ దేశాలకు తరలిపోవాలని ఆయా దేశాల శరణార్థులు ప్రయత్నిస్తున్నారు . ఈ దయనీయ పరిస్థితిని ఆసరాగా చేసుకొని మనుషుల అక్రమ రవాణాదారులు పెద్ద ఎత్తున సొమ్ము చేసుకోవడమే కాక అత్యంత ప్రాణాంతక, అమానవీయమైన పరిస్థితుల్లో వారిని రవాణా చేస్తున్నారు. వీరిలో ఐరోపాకు వలసపోతున్న శరణార్థుల్ని లిబియా స్మగ్లర్లు అంగడి సరుకుల్లా పసువుల్ని అమ్మినట్లు మనుషుల్నిఅమ్మేస్తున్నారు. ఒక్కోవ్యక్తిని రూ.20 నుంచి రూ.30 వేల వరకు వెలకట్టి అమ్మేస్తున్నారు. ఆరోగ్యం,కండబలాన్నీ బట్టి రేటుకట్టి విక్రయిస్తున్నారు. స్మగ్లర్ల పడవలపై ఐరోపా దేశాలు విరుచుకుపడుతుండటంతో.. శరణార్థుల్ని ఎక్కడికి తీసుకువెళ్లాలో దిక్కుతెలియని స్మగ్లర్లు వారిని వేలంలో విక్రయించేస్తున్నారు. 

Similar News