మాధవీలత మౌనదీక్ష భగ్నం...

Update: 2018-04-18 05:48 GMT

ఫిల్మ్ ఛాంబర్ ఎదుట నటి మాధవీలత మౌనదీక్షకు దిగారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌‌పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మాధవీలత మౌనదీక్ష చేపట్టారు. ఈ విషయం తెలియగానే పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని మాధవీలత దీక్షను భగ్నం చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇలాంటి దీక్షలు చేసేటప్పుడు లోకల్ పరిధిలో ఉన్న పీఎస్ పర్మిషన్ తీసుకోవాలని, అలాంటిదేమీ లేకుండా దీక్ష చేయరాదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ... మాధవీలతను, ఆమెకు మద్దతుగా ఉన్నవారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అయితే, తన దీక్షను అడ్డుకున్నా పోలీస్ స్టేషన్లో నైనా కొనసాగిస్తానని అందుకు అనుమతించాలని మాధవీలత పోలీసులను అభ్యర్థించారు. సంబంధం లేని వ్యక్తుల మీద సంస్కారం లేని వ్యాఖ్యలకు నిరసనగానే తాను మౌన దీక్ష చేస్తున్నానని మాధవీలత వివరణ ఇచ్చారు. ఇది పర్సనల్ గా చేస్తున్న పొటెస్ట్ కాదని, ఆ వ్యాఖ్యలు ఏ హీరో మీద అయినా తన వైఖరి ఇలాగే ఉంటుందని చెప్పారు. అలాంటి పదజాలాలు తాను ఉపయోగించలేనని.. అందుకే తానేమీ చేయలేని నిస్సహాయస్థితిలో మౌనదీక్షకు దిగాల్సి వచ్చిందని మాధవీలత చెప్పుకొచ్చారు.


 

Similar News