బుల్లితెరపై బహుబలి టీం సందడి చేయనున్న సంగతి తెలిసిందే. స్టార్ వరల్డ్ ఇండియా చానెల్లో ప్రసారమవుతోన్న కాఫీ విత్ కరణ్ షోకి బాహుబలి టీం రాజమౌళి, రానా, ప్రభాస్‌లు హజరయ్యారు. బుల్లితెరపై ఇప్పటికే రానా నం-1 యారీ కార్యక్రమంలో కనిపిస్తారు. అలాగే అప్పుడప్పుడు ఏదో కార్యక్రమంలో రాజమౌళి కూడా ప్రత్యక్షమౌతారు. కాగా బహుబలి-2 తరువాత యంగ్ రెబల్ స్టార్ సాహో చిత్రంలో ఫుల్ బీజీలో ఉన్నారు. కాగా తాజాగా కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈనెల23 తారీకు నాడు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ఎపిసోడ్ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ కార్యక్రమంలో కరణ్ మాట్లాడుతూ రానా, ప్రభాస్‌లలో ఎవరేక్కువ బ్యాడ్ బాయ్’ అని కరణ్, రాజమౌళిని(జక్కన్నను) ప్రశ్నించారు. దినికి జక్కన్న సమాధానం చెబుతూ ప్రభాస్ బ్యాడ్ బాయ్ కానీ అలా కనిపించడు అంటూ సమాధానమిచ్చారు. మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులు ఈ ఆదివారం రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది.