వ్యూహాత్మక విరామం... ఎత్తుగడ మారుతుంటుంది

Update: 2018-12-13 14:06 GMT

కేసిఆర్‌కి ఎవరైనా ఒక్కరే లక్ష్యసాధనలో వ్యూహాత్మకంగా అడుగులు పడతాయి పెదాలు కదులుతాయి. సందర్భాన్ని బట్టి పదాలు పడతాయి. పరిస్థితులను బట్టి వేరియేషన్స్ మారతాయి. మూడ్స్ మారతాయి.. జనం దృష్టి ఎవరిపై టార్గెట్ చేయాలో వారిని వ్యూహాత్మకంగా మాటల చట్రంలో బంధిస్తారు.. ఒక విధంగా చెప్పాలంటే టార్గెట్ సెట్ చేసి వదిలేస్తారు. ఇక ఆ దాడిలోంచి బయటపడటం అన్నది ప్రత్యర్ధి సమస్య. ఉద్యమం అంటే కొలిమి కాదు. నిరంతరం రగిల్చేందుకు. ఇందులో వ్యూహాత్మక విరామం ఉంటుంది... ఎత్తుగడ మారుతుంటుంది... ఈ శైలే కారుకు విజయాన్నిచ్చింది. వివిధ సందర్భాల్లో  ఆయన ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా దానిని సమర్ధించుకునే సత్తా ఆయనకుంది. 

నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదులే అన్నది కేసిఆర్ స్టైల్.. ఏటికి ఎదురీదడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం ఒక్కోసారి వింత వాదనలకూ ఆయన తెరలేపారు.. పాపులర్ జనాభిప్రాయానికి విరుద్ధంగా ఆయన ప్రకటన చేసిన సందర్భాలు అనేకం.. కాటన్ దొర మీకు దేముడైతే నిజాం తమకూ దేవుడంటూ తన వాదంతో ఢీకొట్టారు.. తన ఉనికిని చాటుకున్నారు.. నిజాంకు వంత పాడి  తెగువతో రాజకీయాలు చేశారు.. తెలంగాణ ఉద్యమాన్ని తప్పుబట్టిన వారందరినీ ఈ తెగువతోనే ఆయన ఢీకొన్నారు.. మాటల తూటాలతో ప్రత్యర్ధులను ఉక్కిరి బిక్కిరి చేశారు. పదునైన డైలాగులు పేల్చి ప్రత్యర్థుల నోరు మూయించారు. 

సెంటిమెంట్‌తో కొడితే  ఎంతటి వారయినా బుట్టలో పడాల్సిందే. వాదంలో  సత్తా చెప్పే పాయింట్‌లో రీజన్ కనపడితే.. ప్రజలు బ్రహ్మరథం పడతారు.. కంటికి కనపడని సమస్యని కళ్లకు కట్టినట్లు విప్పి చెప్పి.. ఆ సమస్య ప్రభావాన్ని ప్రజల గుండెల్లోకి తీసుకెళ్లడంలో కేసిఆర్‌ది అందె వేసిన చేయి. ఉద్యమాన్ని ఎప్పుడు లేపాలి ఎప్పుడు టోన్‌డౌన్ చేయాలి అన్న టైమ్ సెన్స్ తెలిసిన పొలిటీషియన్ కేసిఆర్ గురితప్పని ఆ ముందు చూపే తెలంగాణలో ఆయన్ను తిరుగులేని నాయకుడిని చేసింది. 

Similar News