పధ్నాలుగేళ్ల పాటూ ఉద్యమాన్ని నడపడం మాటలు కాదు

Update: 2018-12-13 14:01 GMT

పదిహేడేళ్లలో ఎంత తేడా? అప్పట్లో ఆయన ఆంధ్రుడి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన పార్టీలో సభ్యుడు.. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను పొగడుతూ పార్టీ కోసం పాటలే రాసిన అభిమాని.. కాలగమనంలో ఆ పార్టీనే సవాల్ చేసే ప్రత్యర్ధిగా మారిపోయారు.. టీఆర్‌ఎస్‌ ప్రస్థానం, కేసిఆర్ బ్యాక్‌డ్రాప్ ఓసారి చూద్దాం. కేసిఆర్ ప్రస్థానంలో ప్రతీ అడుగూ ప్రత్యేకమే. వేసే ప్రతీ అడుగు మాట్లాడే ప్రతీ మాట ప్రత్యేకమే. పధ్నాలుగేళ్ల పాటూ ఉద్యమాన్ని నడపడమంటే మామూలు వ్యక్తులకు సాధ్యం కాదు.. అందులోనూ భావోద్వేగంతో ముడిపడిన సమస్యని నిరంతరం లైమ్ లైట్‌లో ఉంచడం చిన్న విషయమేమీ కాదు 2001 ఏప్రిల్‌ 27కి ముందు ఆయన తెలుగుదేశం అభిమానిగా పార్టీలో చేరారు. ఆంధ్రుల ఆత్మగౌరవ పోరాట నినాదం ఆయనను టీటీడీ అడుగులు వేయించింది. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన పార్టీ జెండా మోశారు. పార్టీ కోసం ఆసక్తికరమైన కొటేషన్లు రాశారు.. అన్న ఎన్టీఆర్‌పై అభిమానంతో తెలుగుదేశం పార్టీ కోసం పాటలు రాశారు.. తన కొడుక్కి అభిమాన నటుడి పేరు పెట్టుకున్నారు తెలుగుదేశంపైనా, తెలుగు జాతిపైనా అంతలా ప్రేమాభిమానాలు కురిపించిన నేత కాలగమనంలో అదే పార్టీకి ప్రత్యర్ధిగా మారిపోయారు. 

మిగతా నాయకుల్లో లేనిది ఆయనలో ఉన్న ప్లస్ పాయింట్ కేసిఆర్ టైమింగ్ తెలిసిన నాయకుడు.. ఏ విషయాన్నయినా సూటిగా, ఘాటుగా చెప్పడం, చెప్పిన దానికన్నా.. తన వ్యాఖ్యానాలపై వచ్చే కౌంటర్లకు కౌంటర్లిస్తూ మాటల మంటలు పుట్టించడం ఆయనకు మాత్రమే తెలిసిన విద్య.. వ్యూహానికి తగినట్లుగా నిర్భయంగా, నిస్సంకోచంగా మాట్లాడటం ఆయనకున్న ప్లస్ పాయింట్లలో ఒకటి. ఏమైనా 14 ఏళ్ల పాటూ ఉద్యమం సాగించడం గత చరిత్ర. 

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. అందుకే 2009లో  మహాకూటమి పేరుతో చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నారు. బహిరంగ సభలపై చంద్రబాబు ఒక స్థాయి ఉన్న నాయకుడని, మార్గదర్శి అని కీర్తించడం.. వైఎస్‌ను విమర్శించడం అన్ని మన కళ్ల ముందు జరిగిన వాస్తవాలే.. ఈ రెండు కేసిఆర్ నిర్ణయాలే  రెండు సందర్భాల్లోనూ ఆయన  జనాన్ని ఒప్పించగలిగారు  ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో విడమరిచి చెప్పారు..  అవసరానికి తగ్గట్లుగా జనం మూడ్‌ను తన దారిలోకి తెచ్చుకోవడం ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే విద్య.. 2004లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడు సోనియాను దేవతని కీర్తించారు.. 

Similar News