డ్రాగా ముగిసిన ఢిల్లీ టెస్ట్

Update: 2017-12-13 06:58 GMT

ఢిల్లీ టెస్ట్ రెండోఇన్నింగ్స్ లో శ్రీలంకను ఆలౌట్ చేయడంలో టీమిండియా బౌలర్లు విఫలమయ్యారు. 410 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక చివరకు 5 వికెట్లకు 299 పరుగులతో మ్యాచ్ ను గౌరవప్రదమైన డ్రాగా ముగించింది. వన్ డౌన్ ఆటగాడు ధనుంజయ డి సిల్వా ఫైటింగ్ సెంచరీకి రోషన్ డీ సిల్వా, డిక్ వెల్లాల కీలక భాగస్వామ్యం తోడు కావడంతో టీమిండియా బౌలర్లు విఫలంకాక తప్పలేదు. రోషన్ డి సిల్వా 74, డిక్ వెల్లా44 పరుగుల స్కోర్లతో అజేయంగా నిలిచారు. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు, అశ్విన్, షమీ చెరో వికెట్ పడగొట్టారు. మూడుమ్యాచ్ ల సిరీస్ ను 1-0తో నెగ్గడం ద్వారా టీమిండియా సిరీస్ నిలుపుకోగలిగింది. కెప్టెన్ విరాట్ కొహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కాయి. విరాట్ కొహ్లీ నాయకత్వంలో టీమిండియాకు ఇది వరుసగా తొమ్మిదో టెస్ట్ సిరీస్ విజయం. ఈ సిరీస్ విజయంతో గతంలో ఆస్ట్రేలియా పేరుతో ఉన్న తొమ్మిది సిరీస్ విజయాల ప్రపంచ రికార్డును టీమిండియా సమం చేయగలిగింది.

Similar News