వివాదంలో ‘మహా’.. హన్సికపై కేసు

Update: 2018-12-17 08:56 GMT


తాజాగా హన్సిక నటిస్తున్న చిత్రం "మహా" సినిమా చిక్కుల్లో పడింది. ఈ చిత్రానికి యు.ఆర్ జమీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రంలో హన్సిక స్వామీజీ వేషధారణలో పోగ(చుట్ట) పిల్చుతూ కనిపించారు. ఇక ఈ పోస్టరే హన్సికను, దర్శకుడ్ని పెద్ద వివాదంలో పడేసింది. వీరిపై పీఎంకే సభ్యుడు జానకి రామన్ పోలీసు ఠాణాలో కేసు వేశారు. ఈ పోస్టరు  ప్రజల మత విశ్వాసాలను దెబ్బతీసేలా జానకి మండిపడ్డారు. కాగా ఈ విషయంపై దర్శకుడు యు.ఆర్ జమీల్ వివరణ ఇస్తూ ట్వీట్టర్ వేదికగా స్పందించారు. సోషల్‌మీడియాలో నెటిజన్ల కామెంట్లను చూసి గాయ్స్ మీ అందరి కామెంట్లు చూశా. ఓ దర్శకుడిగా పోస్టర్‌ ప్రత్యేకంగా ఉండాలని భావించా తప్ప ఇంకా వేరే ఉద్దేశంతో తప్ప మతపరంగా రెచ్చగొట్టే విధంగా మరొకర్ని కించపర్చాలని చేయలేదని యు.ఆర్‌. జమీల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

Similar News