ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులని దోచుకుంది మలయాళ ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఆమె మలయాళీ నటి అయినప్పటికీ మొదటి సినిమాకే తెలుగులో డబ్బింగ్ చెప్పారు. చక్కటి అభినయం, డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఆమె నాని సరసన ‘ఎంసీఏ’ సినిమాలో నటించారు. మరోపక్క ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్న ‘కణం’ సినిమాలోనూ కథానాయిక పాత్ర పోషించారు. ఈ రెండు చిత్రాల పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం కాస్త టైం దొరకడంతో సోదరి పూజా కన్నన్‌తో కలిసి స్పెయిన్‌లో చక్కర్లు కొడుతుంది. స్పెయిన్‌లో వివిధ ప్రాంతాలని సందర్శిస్తూ అక్కడి ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అక్కా చెల్లెళ్ళు. ఈ పిక్స్ ఫ్యాన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సాయిపల్లవి ‘మారి 2’ అనే తమిళ సినిమాలో నటించనుండగా,. హను రాఘవపూడి దర్శకత్వం వహించనున్న ఓ తెలుగు ప్రాజెక్టు చేయనున్నట్టు టాక్.