తండ్రిపై కేసు పెట్టిన కుమార్తె

Update: 2018-10-24 07:15 GMT

అనేక వివాదాల‌తో ప‌లు మార్లు జైలుకి వెళ్లిన న‌టుడు దునియా విజ‌య్. హీరోగానే కాకుండా విల‌నిజం కూడా ప్ర‌ద‌ర్శిస్తూ క‌న్న‌డ‌ ప్రేక్ష‌కుల అభిమానుల మ‌న‌సులు గెలుచుకున్నాడు విజ‌య్. అయితే దునియా విజ‌య్‌ని ఆయ‌న కూతురే ఇర‌కాటంలో పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. విజయ్, ఆయన మొదటి భార్య నాగరత్నలు చాన్నాళ్ల క్రితమే విడిపోయారు. మోనిక తల్లి వద్దే ఉంటోంది. ఈ నేపథ్యంలో విజయ్ ఇంట్లో ఉన్న తన బట్టలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర వస్తువులను తీసుకోవడానికి నిన్న రాత్రి పదిన్నరకు అక్కడకు వెళ్లింది. ఈ సందర్భంగా విజయ్ తో పాటు అతని స్నేహితులు కూడా తనను కొట్టారని ఫిర్యాదులో మోనిక ఆరోపించింది. దీనిపై విజయ్ స్పందిస్తూ, మోనికను ఎవరూ, ఏమీ అనలేదని చెప్పారు. కావాలనే తనపై తప్పుడు కేసు పెట్టిందని అన్నారు. మరోవైపు, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.  
 

Similar News