ఫసిఫిక్ మహాసముద్రంలో కూలిన చైనా స్పేస్ ల్యాబ్

Update: 2018-04-02 07:09 GMT

అంతరిక్షంలో అదుపుతప్పి తిరుగుతున్న చైనా స్పేస్ ల్యాబ్ తియాంగాంగ్‌-1 ఫసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయింది. భూ వాతావరణంలోకి వస్తూనే స్పేస్ ల్యాబ్ మండిపోతూ సముద్రంలో పడిపోయినట్లు చైనా అధికారులు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా ఈ స్పేస్ ల్యాబ్ భూమిపై ఎక్కడ పడుతుందోనని ఆందోళన చెందిన వారికి ఈ న్యూస్ ఊరటనిస్తోంది.  8 టన్నుల బరువు గల ఈ స్పేస్‌ ల్యాబ్‌ శకలాలు ఎక్కువ శాతం గాల్లోనే మండిపోయినట్లు తెలిపారు. బీజింగ్‌ సమయం ప్రకారం ఉదయం 8.15నిమిషాలకు దక్షిణ పసిఫిక్‌లోని మధ్య భాగంలో స్కైల్యాబ్‌ శకలాలు పడినట్లు వెల్లడించారు. తియాంగాంగ్‌-1ను 2011 సెప్టెంబర్‌లో ప్రయోగించారు. రెండేళ్ల పాటు సేవలు  అందించేలా దీనిని రూపొందించారు.  2016 మార్చి నుంచి దీని సేవలు ఆగిపోయాయి. ఆ తర్వాత నెమ్మదిగా నియంత్రణ కోల్పోయింది. చివరకు సముద్రంలో కూలిపోవడంతో స్పేస్ ల్యాబ్ కథ ముగిసినట్టైంది.

Similar News

నేను సైతం!
StoryFour
StoryThree