అందుకోసమే నగ్నంగా నటించా!

Update: 2018-06-15 06:26 GMT

అర్థ నగ్నంగా, లేదా బికినిలో నటించడానికి చాలామంది నాయికలు ఇబ్బంది పడతారు. అలాంటిది ఏకంగా ఒక నాయిక నగ్నంగా నటించడం ఆసక్తి కలిగించింది. ఆ మధ్య తమిళంలో విడుదలైన ఎక్స్‌ వీడియోస్‌ అనే సినిమాలో నటి ఆకృతి సింగ్‌ నగ్నంగా ఒక సన్నివేశంలో నటించింది. అసలు విషయానికి వస్తే..ఈ మద్య కాలంలో సోషల్ మీడియాలో  కొన్ని వెబ్ సైట్లలో ఫోర్న్ వీడియోలు విపరీతంగా వస్తున్నాయి.  ఇక టీనేజ్ నుంచి ముసలి వాళ్ల వరకు ఈ ఫోర్న్ సినిమాలకు బానిసలు అవుతున్నారు. దాంతో యువత పెడదారి పడుతుంది..చెడిపోతోంది.

ఇదే విషయంపై ప్రజల్లో అవగాహ కల్పించడం కోసం తీసిన సినిమా ఎక్స్‌ వీడియోస్‌. నూతన దర్శకుడు సజో సుందర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా టైటిల్‌ చూడగానే ఏ ఉద్దేశంతో తీశారనేది స్పష్టమవుతోంది. అయితే సినిమా కోసం తీసుకున్న కథాంశం, ఉద్దేశం పట్ల మాత్రం ప్రేక్షకులు, సీనియర్‌ తారలు ప్రశంసించడం విశేషం. ఈ చిత్రంలో ఆకృతిసింగ్‌ నగ్నంగా నటించిందనే వార్త మాత్రం సంచలనం సృష్టించింది.

దీనిపై స్పందించిన  ఆకృతిసింగ్‌  ఒక సామాజిక సమస్యపై ప్రజలను జాగృతం చేసే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. కొందరు సరదా కోసం ఫోన్‌లో తీసుకునే వీడియోలు ఎలాంటి అనర్ధాలకు దారితీస్తున్నాయనేది సినిమాలో చూపించారు. ఒకనటిగా పాత్రకు న్యాయం చేయడం కోసం నగ్నంగా నటించాను.  అది అశ్లీలత కాదు..అలా భావించే వారిని ఏమీ చేయలేం అని అన్నారు ఆకృతిసింగ్‌.  సినిమా చూసిన తర్వాత మనకు తెలియకుండా ఎలాంటి పొరపాట్లు చేస్తున్నామనేది తెలుస్తుంది అని ఆకృతి చెప్పింది.
 

Similar News