అత్యవసర పరిస్థితి ఇది...పెథాయ్‌ తుపానుపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌

Update: 2018-12-17 06:18 GMT

పెథాయ్ తుపాను నేథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు, నోడల్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇది అత్యవసర పరిస్థిగా భావించాలని సీఎం అధికారులకు సూచించారు దానికి తగ్గట్టుగా పనిచేయాలని ఎవరూ సెలవులు పెట్టకూడదని చంద్రబాబు అన్నారు. అందరూ విధులకు తప్పకుండా హాజరు కావాలన్న చంద్రబాబు విపత్తును ఎదుర్కోవడానికి ప్రతిశాఖకు యాక్షన్ ప్లాన్, ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని వాటికి అనుగుణంగా పనిచేయాలన్నారు. సకాలంలో విద్యుత్‌ పునరుద్ధరణ, ట్రాఫిక్‌ క్లియరెన్స్‌ జరగాలన్నారు. తాగునీరు, ఆహారం, నిత్యావసరాలకు కొరత లేకుండా సిద్ధం చేసి ఉంచుకోవాలని ఆదేశించారు. అలాగే.. విపత్తు నిర్వహణలో పౌర బాధ్యత కూడా గుర్తు చేయాలని, సహాయ చర్యల్లో ప్రజల సహకారం తీసుకోవాలని సూచించారు. 
 

Similar News