పల్లె కోయిలకు రెహ‌మాన్ ప్రశంసలు

Update: 2018-11-15 07:29 GMT

ఇటీవల సోషల్ మీడియాలో పాపులర్ అయిన పల్లె కోయిల బేబీ పాటకు ఏఆర్ రెహ‌మాన్ కూడా ఫిదా అయాడు. పల్లె కోయిల బేబీని హెచ్‌ఎంటీవీ స్టూడియోకు పిలిపించి ఆమె ప్రతిభను చాటిచెప్పింది. అటు ఇటూ తిరిగి సోషల్‌ మీడియాతో బేబీ గొంతును విని ఫిదా అయిన టాలీవుడ్ ప్రముఖులు ఆమెకు ఛాన్స్‌లు కూడా ఇస్తున్నారు. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు.. అయితే ఆయన శిష్యుడు, ఇండియాలో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహిత ఏఆర్ రెహ్మాన్ కూడా బేబీ పాటకు ఫిదా అయ్యారు.. తన ఫేస్‌బుక్ పేజీలో బేబీ పాటను షేర్ చేశారు. ఎవరో తెలియదు కానీ చాలా బాగా పాడారు అంటు బేబీని మెచ్చుకున్నారు. దీంతో బేబీ పేరు బాలీవుడ్ రేంజ్‌లో మారుమోగుతుంది. ఆయన చేసిన పోస్టును వన్ మిలియన్ వరకు చూస్తే చాలా మంది షేర్లు చేస్తున్నారు. మొత్తానికి ఎవరి సాయం లేకుండా సోషల్ మీడియా ద్వారా,  Hmtv ద్వారా అందరి ముందుకు వచ్చిన బేబీకి ఏఆర్ రెహ్మాన్ ప్రసంశలు లభించటం అంటే మాములు విషయం కాదు మరి!!
 

Full View

Similar News