తెలుగింటి ఆడపడుచు శ్రీదేవి

Update: 2018-02-26 05:53 GMT

సినిమా రంగాన్ని ఓ ఊపు ఊపిన హీరోయిన్, అతిలోకసుందరి శ్రీదేవి...అచ్చ తెలుగు ఆడపడుచు. శ్రీదేవి తమిళనాడులోని శివకాశిలో జన్మించినప్పటికి...ఆంధ్రప్రదేశ్‌లోనూ మూలాలు ఉన్నాయ్. అమె తల్లి రాజేశ్వరి తిరుపతిలోని తీర్థకట్టవీధిలో జన్మించారు.

ఇండియన్ సూపర్‌స్టార్‌ శ్రీదేవి తెలుగింటి ఆడపడుచు. అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగమ్మాయ్. శ్రీదేవి అమ్మమ్మ వెంకటరత్నమ్మ స్వస్థలం కడప జిల్లాలోని జమ్మలమడుగు సమీపంలోని గేరంపల్లి. వెంకటరత్నమ్మకు తిరుపతికి చెందిన వెంకటస్వామిరెడ్డిని వివాహం చేసుకున్న తర్వాత తీర్థకట్టవీధిలో స్థిరపడ్డారు. వెంకటరత్నమ్మకు రాజేశ్వరి, అనసూయమ్మ, అమ్రుతమ్మ, శాంతకుమారి, బాలసుబ్రమణ్యం, సుబ్బరామయ్య సంతానం. 

రాజేశ్వరి చెన్నైలో చదువుతున్న సమయంలో సహచర విద్యార్థి అయ్యప్పన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రాజేశ్వరి చెల్లెలు అనుసూయమ్మ తిరుపతికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నారు. అనసూయమ్మ అంటే శ్రీదేవికి ఎంతో ఇష్టం. వివాహానికి ముందు శ్రీదేవి గారాబంగా చూసుకున్నారు. పెళ్లయిన తర్వాత శ్రీదేవి రెగ్యులర్‌గా తిరుపతికి వచ్చి వెళ్లేంది. 1991లో శ్రీదేవి తండ్రి అయ్యప్పన్‌ మరణిస్తే 1997లో తల్లి రాజేశ్వరి చనిపోయారు. అనారోగ్యంతో బాధపడుతున్న రాజేశ్వరిని చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్తే తలలో ఒక వైపు చేయాల్సిన ఆపరేషన్‌, మరోవైపు చేయడంతో ఆమె మృతి చెందారు. చంద్రగిరి మండలం ఏ రంగంపేటతో శ్రీదేవికి విడదీయరాని అనుబంధం ఉంది. ఆమె మేనత్త నాగమ్మది రంగంపేట కావడంతో ఆమె కుమార్తె అమరావతమ్మ వివాహానికి వచ్చి వెళ్లారు. శ్రీదేవి మృతి తెలుగు రాష్ట్రాల ప్రజలు విషాదంలో మునిగిపోయారు. 

Similar News