విజయ్ అత్మహత్యకు అతని తండ్రే కారణం

Update: 2017-12-13 12:59 GMT

సినీ  కమెడియన్ విజయ్ మృతి కేసు లో మరో ట్విస్ట్.. ఆత్మహత్యపై అతని భార్య వనితా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. విజయ్ అత్మహత్యకు అతని తండ్రి సుబ్బారావే కారణమని అన్నారు. తండ్రీ కొడుకుల మధ్య ఆస్తి తగాదాలున్నాయన్న వనిత ఇదే విషయంలో విజయ్ తండ్రితో చాలాసార్లు గొడవ పడ్డాడని తెలిపారు. కూతురి పేరుతో స్తలాన్ని రాయాలని తండ్రిని... విజయ్ తరుచూ అడిగేవాడనీ...ఈ గొడవల వల్లే విజయ్ ప్రాణాలు తీసుకున్నాడని ఆరోపించారు. కేసును తప్పుదోవ పట్టించడానికే తనపై ఆరోపణలు చేస్తున్నారన్న వనిత...ఆ ఆరోపణలకు త్వరలో సమాధానం చెబుతానని అన్నారు.

Similar News