డిసెంబర్14న విడుదలైన హుషారు సినిమా మంచి టాక్ అందుకుంది. ఈ హుషారు సినిమాలోని పాట తన మనసును వెంటాడుతోందని ప్రముఖ కథానాయకుడు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. అయితే హుషారు సినిమాలో ‘ఉండిపోరాదే..’ అనే పాట పోస్టర్ను బన్నీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఈ పాట చాలా అద్భుతమైన పాట అని, నన్ను వెంటాడుతూ ఉందని బన్ని తెలిపారు. ఈ సినీ దర్శకుడు రాధన్ గొప్ప మ్యూజిక్ అందించి, గాయకుడు సిద్ శ్రీరామ్ చాలా చక్కగా పాడారని చాలా రోజుల తరువాత విన్న మంచి పాట ఉండిపోరాదే పాట అని బన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. గ్రేట్ వర్క్.. ఇలాగే రాణించండి’ అని బన్ని ప్రశంసిస్తూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. కాగా బన్ని ఇటివలే నా పేరు సూర్యా నా ఇల్లు ఇండియా తరువాత ఏ మూవీ చేస్తున్నాడో తెలియాల్సిఉంది. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.