ముంబయి: బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ రాణిస్తున్న కథానాయిక ప్రియాంకా చోప్రా. ఈ బ్యూటీ సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి ప్రాంతీయ చిత్రాలను కూడా నిర్మిస్తున్నారు. ఆమె నిర్మాతగా వ్యవహరించిన ‘వెంటిలేటర్’ సినిమాకు విశేషమైన స్పందన లభించింది. అంతేకాదు ప్రియాంక మరోవైపు తన మధురమైన స్వరంతోనూ శ్రోతల్నికట్టిపడేశారు. ఆమె పాడిన పలు పాటలు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పుడు మరో పాటతో ప్రియాంక అభిమానుల ముందుకు వచ్చారు. తన కొత్త పాట ‘యంగ్ అండ్ ఫ్రీ’ను ఆమె సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. దాన్ని ఎక్కువ శబ్దంతో వినమని ట్వీట్ చేశారు.
ప్రియాంక ఈ పాటను రాచెల్ రాబిన్, టోబి గడ్, టైరోన్ విలియం గ్రిఫ్ఫిన్ జేఆర్ తదితరులతో కలిసి రచించారు. ప్రస్తుతం ఈ పాట మ్యూజిక్ యాప్ సావన్‌లో అందుబాటులో ఉంది. ఓ ప్రయోగం.. రియాల్టీగా మారిందని, తమ బృందం సరదాగా స్టూడియోలో కూర్చొని ఈ పాటను రాశామని ప్రియాంక తెలిపారు.
Play it LOUD #YoungAndFree #OutNow pic.twitter.com/inr2Vr2iGs
— PRIYANKA (@priyankachopra) August 11, 2017