పెరిగిన పెట్రోల్ ధరలు..నిలకడగా డీజిల్!

ఒకవైపు పెట్రోల్ ధరలు దేశీయంగా గురువారం పైకెగశాయి. మరోవైపు డీజిల్ ధరలు నిలకడగా ఉన్నాయి.

Update: 2019-11-14 04:35 GMT

 పెట్రోల్ ధర పెరిగింది...మరోవైపు పెరుగుతూ వస్తున్న డీజిల్ ధరలు ఈరోజూ నిలకడగా ఉన్నాయి. 14-11-2019 గురువారం పెట్రోల్ ధరలు పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో పెట్రోల్ ధర లీటరుకు 15 పైసలు పెరిగి  78.16 రూపాయల వద్ద నిలిచింది. ఇదే సమయంలో డీజిల్ ధర మాత్రం మారకుండా నిలకడగా 71.80 రూపాయల వద్ద నిలిచింది. అటు అమరావతిలోనూ ఇదే పరిస్థితి వుంది. ఇక్కడా పెట్రోల్ ధర లీటరుకు 16 పైసలు పెరిగి పెట్రోల్ ధర 77.61 రూపాయల వద్దకు చేరింది. డీజిల్ ధర 71.10 రూపాయల వద్ద నిలకడగా ఉంది. ఇక విజయవాడలో కూడా పెట్రోల్ ధర పెరిగాగా, డీజిల్ ధర మార్పులేకుండా ఉంది. అక్కడ పెట్రోల్ ధర పెట్రోల్ ధర లీటరుకు 15 పైసలు పెరిగి లీటరుకు 77.40 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరుకు 70.76 రూపాయలుగానూ నిలిచాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ పెట్రోల్ ధర లీటరుకు 15 పైసలు పెరిగి 73.25 రూపాయలుగానూ, డీజిల్ ధర మార్పులేకుండా 65.79 రూపాయలుగానూ ఉన్నాయి. వాణిజ్య రాజధాని ముంబయిలోను ఇలాగే ఉంది. అక్కడ పెట్రోల్ ధర లీటరుకు  15 పైసలు పెరిగి  78.92 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరుకు 69.01రూపాయలుగానూ ఉన్నాయి.

పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు మారుతుంటాయి. ఈ విధానం రెండేళ్లుగా అమలులోకి వచ్చింది. ప్రతి ఉదయం ముఖ్య నగరాల్లో ప్రకటించిన పెట్రోల్ ధరలు ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది.

Tags:    

Similar News