Petrol Price Today: పైకి కదిలిన ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు

నిన్న నిలకడగా ఉన్న పెట్రోల్ ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. డీజిల్ ధరలో కూడా పెరిగాయి.

Update: 2019-09-26 03:38 GMT

ఎనిమిది రోజుల పెరుగుదలకు బుధవారం బ్రేక్ పడినా ఆ ట్రెండ్ కొనసాగలేదు. ఎనిమిది రోజుల భారీగా పెరుగుదలకు విరామమిచ్చి నిలకడగా నిలిచిన పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు మళ్లీ పాకి కదిలాయి.

ఇక బుధవారం తో పోలిస్తే గురువారం పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప పెరుగుదల చోటుచేసుకుంది. హైదరాబాద్ లో పెట్రోల్ ధర 7 పైసలు పెరిగి 78.87 రూపాయలుగా నిలిచింది. డీజిల్ ధర 8 పైసలు పెరిగి 73.19 రూపాయలైంది. ఇక అమరావతిలో నూ అదే పరిస్థితి ఉంది. ఇక్కడ పెట్రోల్ ధర 6 పైసలు పెరిగి 78.53 రూపాయలు గానూ, డీజిల్ ధర 8 పైసలు పెరిగి 72.52 రూపాయలుగానూ నమోదు చేసింది. విజయవాడలోనూ పెట్రోల్ ధర 6 పైసలు పెరిగి రూ.78.16, డీజిల్ ధర 7 పైసలు పెరిగి 72.17 రూపాయలకు చేరింది.

దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లోనూ పెట్రోల్ ధరల్లో మార్పు లేదు. ముంబాయిలో పెట్రోల్ ధర 6 పైసలు పెరిగి 79.85 రూపాయలు, డీజిల్ డీజిల్ ధర 7 పైసలు పెరిగి 70.44 రూపాయలు గానూ, ఢిల్లీలో పెట్రోల్ ధర 6 పైసలు పెరిగి 74.19 రూపాయలుగానూ, డీజిల్ ధర 7 పైసలు పెరిగి 67.14 రూపాయలుగానూ ఉంది.


Tags:    

Similar News