Helmet AC: కూలింగ్‌ హెల్మెట్‌.. బటన్‌ నొక్కితే చాలు ఏసీ ఆన్‌..!

Helmet AC: బైక్‌ నడిపేటప్పుడు రైడర్లు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య హెల్మెట్‌.

Update: 2022-09-22 10:30 GMT

Helmet AC: కూలింగ్‌ హెల్మెట్‌.. బటన్‌ నొక్కితే చాలు ఏసీ ఆన్‌..!

Helmet AC: బైక్‌ నడిపేటప్పుడు రైడర్లు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య హెల్మెట్‌. దీని కారణంగా చాలా అసౌకర్యానికి గురవుతారు. ఎందుకంటే హెల్మెట్‌ పెట్టుకున్న కొద్ది సేపటికే తల మొత్తం ఉక్కపోతగా ఉంటుంది. దాదాపు అందరు బైక్‌ రైడర్లు ఎదుర్కొనే సమస్య ఇది. అయితే ఇప్పుడు మార్కట్‌లోకి ఒక కొత్త హెల్మెట్‌ వచ్చింది. దీనిని ధరిస్తే ఎలాంటి ఉక్కపోత ఉండదు.. తల మొత్తం చల్లగా ఉంటుంది. దీనిని కూలింగ్‌ హెల్మెట్‌గా చెప్పవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

రైడింగ్ చేసేటప్పుడు కూలింగ్ హెల్మెట్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఒక పరికరం అమరుస్తారు. ఇది హెల్మెట్‌ను చల్లబరుస్తుంది. ఒక్క నిమిషం కూడా వేడిలో ప్రయాణించినట్లు అనిపించదు. కూలింగ్ హెల్మెట్ పరికరాలని తయారు చేసే కంపెనీలు మార్కెట్లో అనేకం ఉన్నాయి. వీటిలో బ్లూ ఆర్మర్ అనే కంపెనీ ఒకటి. ఇది ఈ పరికరాన్ని తయారు చేస్తుంది. ధర రూ.1,999, 2,299 నుంచి రూ.4,999 వరకు ఉంటుంది.

ఈ పరికరం బ్యాటరీతో నడుస్తుంది. ఇందులో బలమైన ఫ్యాన్ వ్యవస్థ ఉంటుంది. దీంతో పాటు శక్తివంతమైన మోటారు ఉంటుంది. దీంతోపాటు వినియోగదారులు బలమైన ప్లాస్టిక్ బాడీని పొందుతారు. ఇది తేమను సమతుల్యం చేస్తుంది. అద్భుతమైన చల్లదనాన్ని ఇస్తుంది. అయితే ఇలాంటి హెల్మెట్లు కొనుగోలు చేసేముందు ఆలోచించడం అవసరం. అన్ని విషయాలు పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతనే కొనుగోలు చేయడం ఉత్తమం.

Tags:    

Similar News