వాహనదారులకి అలర్ట్‌.. ఈ పని వచ్చే ఏడాదికి వాయిదా..!

Airbag Rules: కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది.

Update: 2022-10-07 14:30 GMT

వాహనదారులకి అలర్ట్‌.. ఈ పని వచ్చే ఏడాదికి వాయిదా..!

Airbag Rules: కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ప్రభుత్వం అక్టోబర్ 1, 2023 నుంచి కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. వాస్తవానికి ఈ నిబంధన ఈ సంవత్సరం అంటే అక్టోబరు 1, 2022 నుంచి అమలులోకి రావాల్సి ఉంది. కానీ ఈ నిర్ణయాన్ని దాదాపు ఒక సంవత్సరం వాయిదా వేసింది.

ఈ ప్రతిపాదనను వాయిదా వేయడానికి గల కారణాన్ని కూడా కేంద్ర మంత్రి తెలిపారు. గ్లోబల్ సప్లై చెయిన్‌లో ఆటో రంగం ఎదుర్కొంటున్న అంతరాయాలు, సూక్ష్మ ఆర్థిక స్థాయిపై దాని ప్రభావం దృష్ట్యా ప్యాసింజర్ కార్ల (M-1) కేటగిరీని వాయిదా వేయాలని నిర్ణయించామని తెలిపారు. వాహనం ఏదయినా వేరియంట్ ఏదయినా మోటారు వాహనాలలో ప్రయాణించే ప్రయాణీకుల భద్రతే మా ప్రాధాన్యత అని పేర్కొన్నారు.

వాహనాల భద్రతను పెంపొందించేందుకు వాహన ప్రయాణికుల భద్రత కోసం సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్, 1989ని సవరించాలని నిర్ణయించినట్లు ఈ ఏడాది ప్రారంభంలో రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి సైరస్ మిస్త్రీ మరణం తర్వాత కారు భద్రతపై చర్చ మొదలైంది. అతని మరణానంతరం కారు సేఫ్టీ ఫీచర్లు, అలాంటి ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులకు ఎలాంటి రక్షణ కల్పించాలనే దానిపై చర్చ జరిగింది.


Tags:    

Similar News