ఆంధ్రులారా తేల్చుకోండి! చంద్రగ్రహణమా లేక జగన్మోహనమా ?

Update: 2020-02-04 05:27 GMT

పొట్లూరి వరప్రసాద్ అంటే తెలియని వారు ఉండరు. వ్యాపారరంగంలో ఓ వెలుగు వెలిగిన ఆయన ఆ తర్వాత సినీ పరిశ్రమలో ప్రవేశించి నిర్మాతగా మారి పి.వి.పి సినిమా అనే పేరుతో ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించి పలు విజయవంతమైన చిత్రాలకి నిర్మాతగా వ్యవహరించారు. ఇక సినిమాలోనే కొనసాగుతూనే రాజకీయాల్లోకి వచ్చారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకి ముందు జగన్ సమక్షంలో అయన వైసీపీ పార్టీలో చేరారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో అయనకి పరాజయం తప్పలేదు.

ఆ తర్వాత పార్టీకి, పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటూ వచ్చిన అయన ఇప్పుడు మళ్ళీ ఆక్టివ్ అయ్యారు. ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ చంద్రబాబు, టీడీపీ పార్టీపైన వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక సినిమాలో ఉన్న అనుభవం ఏమో కానీ పంచ్ డైలాగులు కూడా బాగానే పేలుస్తున్నారు. తాజాగా పింఛన్ పంపిణీ కార్యక్రమంపై అయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. " పెన్షన్ ఇంటికి పంపించే ప్రభుత్వం ఒకటి, ఉద్యోగులను నిరుద్యోగులను చేసి ఇంటికి పంపే ప్రభుత్వం ఇంకొకటి.. మీరే ఎంపిక చేసుకోండి ఆంధ్రులారా.. చంద్రగ్రహణమా లేక జగన్మోహనమా.. జై ఆంధ్రా " అంటూ పీవీపీ ట్వీట్ చేశారు.

దీనికిమందు కృష్ణా కరకట్టపై రిటైనింగ్ వాల్‌ కోసం రూ.126 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ధన్యవాదాలు జగన్ గారూ కృష్ణలంక కరకట్ట వాసుల కల నెరవేర్చారన్నారు. వారందరి తరుపున మీకు హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు. 


Tags:    

Similar News