మహిళలను గృహహింస నుంచి రక్షించడానికి ఏపీలో వన్ స్టాప్ సెంటర్లు

Update: 2020-04-22 05:24 GMT
YS Jagan Mohan Reddy (File Photo)

కరోనా వైరస్‌ ఆడవాళ్లకు ప్రియమైన శత్రువుగా మారింది. భర్త, పిల్లలు, పెద్దలు ఇంటికే పరిమితం చేసింది. ఓ వైపు కుటుంబ సభ్యుల్లో ఆప్యాయత, అనురాగాలు పెరిగితే మరోవైపు ఇల్లాలికి కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. ఇంటిపనులన్నింట్లో నేను సైతం అని దూసుకుపోతున్న వనితలకు కొత్త కష్టాలు పలికరిస్తున్నాయి. లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న దేశాలన్నింటిలో గృహహింస గణనీయంగా పెరుగడం ఆందోళన కలిగిస్తోంది. సొంత ఇంట్లోనే వారికి రక్షణ కరువైందన్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో గృహసింహ, మహిళలపై వేధింపులు పెరిగిపోయాయి. అవగాహన ఉన్న వారు ప్రస్తుత పరిస్థితుల్లో ఇళ్లు వదిలి బయటికి రాలేని వందల మంది హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గృహ హింసను ఎదుర్కొంటున్న మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. 13 జిల్లాల్లో వన్ స్టాప్ సెంటర్స్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇవి 24 గంటల పాటు మహిళలకు అందుబాటులో ఉంటాయి. ఈ సెంటర్ల నుంచే బాధితులకు వైద్య, ఆరోగ్య, మానసిక, సాంఘిక, న్యాయ నిపుణుల నుంచి సహాయక చర్యలు అందుతాయని అధికారులు పేర్కొన్నారు. ఉమెన్ హెల్ప్ లైన్ 181 సైతం 24 గంటలు అందుబాటులో ఉంటుంది.

జిల్లాల్లో తక్షణ సహాయం కోసం కాల్ చేయాల్సిన నంబర్లు

శ్రీకాకుళం – 9110793708

విశాఖపట్టణం – 6281641040

పశ్చిమ గోదావరి - 9701811846

గుంటూరు – 9963190234

పొట్టిశ్రీరాములు నెల్లూరు - 9848653821

కర్నూలు – 9701052497

అనంతపురం – 8008053408

విజయనగరం - 8501914624

తూర్పుగోదావరి 9603231497

కృష్ణ - 9100079676

ప్రకాశం - 9490333797

చిత్తూరు - 9959776697

కడప - 8897723899

Tags:    

Similar News